Header Banner

త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి కీలక భేటీ! ఆయా అంశాలపై చర్చలు..

  Tue May 13, 2025 12:48        Politics

త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక భేటీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌తోపాటు ఆర్మీ చీఫ్‌, నేవీ చీఫ్‌, వైస్‌ ఎయిర్‌ చీఫ్‌, రక్షణ కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ, ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై అధికారులతో రాజ్‌నాథ్‌ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో అన్ని విధాలుగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ఇవాళ ప్రత్యేక బ్రీఫింగ్‌ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో కీలక భేటీ జరగనుంది. ఇందులో ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంబంధించిన ముఖ్య వివరాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనుంది. ఈ బ్రీఫింగ్‌కు ముందు త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీ నిర్వహించి.. ఆయా అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #delhi #Election2024 #APPolitics #india #JPNadda #BJPParty #BJPJPNadda